NEWSNATIONAL

మోదీ బేకార్ స‌ర్కార్ పై ఫైర్

Share it with your family & friends

ఎంపీ సంజ‌య్ సింగ్ ప్ర‌క‌ట‌న

న్యూఢిల్లీ – ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యానికి ముప్పు ఏర్ప‌డింద‌ని, ప్ర‌స్తుతం మోదీ నేతృత్వంలో బీజేపీ సంకీర్ణ జ‌ర్కార్ రాచ‌రిక పోక‌డ‌లు పోతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు జైలు నుంచి బెయిల్ పై విడుద‌లైన ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్.

ఆయ‌న నేరుగా సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. అక్క‌డే ఉన్న ఆయ‌న భార్య సునీతా కేజ్రీవాల్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంత‌రం గురువారం రాజ్ ఘాట్ ను సంద‌ర్శించారు. అక్క‌డే ఉన్న మ‌హాత్మా గాంధీ స‌మాధిని సంద‌ర్శించారు. నివాళులు అర్పించారు.

ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు ఎంపీ సంజ‌య్ సింగ్. ఇప్ప‌టికే మోదీ తాను ఒక్క‌డినే ఉండాల‌ని కోరుకుంటున్నాడ‌ని, కానీ అది జ‌ర‌గ‌ని ప‌ని అని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌లు దేనినైనా భ‌రిస్తారు కానీ స్వేచ్ఛ‌ను హ‌రిస్తే మాత్రం త‌ట్టుకోలేర‌ని, ఇది అర్థం చేసుకుంటే మంచిద‌ని సూచించారు.

ఇప్ప‌టికే ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ల‌ను జైల్లో పెట్టార‌ని ఇదే క్ర‌మంలో ఇంకొంత మంది నేత‌ల‌ను జైలుపాలు చేయాల‌ని చూస్తున్నారంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త‌న యుద్దం మోదీపైనే కాదు బీజేపీ , దాని అనుబంధ సంస్థ‌ల‌పైన కూడా అని ప్ర‌క‌టించారు సంజ‌య్ సింగ్.