వైసీపీకి షాక్ ఎంపీ జంప్
బాబు సమక్షంలో చేరిక
అమరావతి – ఏపీలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఉన్నట్టుండి సీఎం జగన్ మోహన్ రెడ్డికి కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు తనయుడు మాగుంట రాఘవ రెడ్డి గుడ్ బై చెప్పారు. ఆ ఇద్దరు ఈనెల 16న టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరనున్నారు.
గురువారం వైసీపీకి చెందిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ జగన్ కు ఝలక్ ఇచ్చారు. ఈ మేరకు తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు.
ఈ సందర్బంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా ఎంపీతో పాటు
పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ ప్యాలకుర్తి రమేష్, వెంకాయపల్లె ఆలయ చైర్మన్ బేతం కృష్ణుడు, వాల్మీకీ సంఘం నాయకులు ముండ్ల శేఖర్, తలారి కృష్ణ, ఎన్జీవో మాజీ నాయకులు కుబేర స్వామి, నరసింహులు, శాంతకుమారి, తదితరులు చేరారు.