NEWSNATIONAL

మ‌న్మోహ‌న్ సింగ్ మ‌హానుభావుడు

Share it with your family & friends

కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ ఆవేద‌న

ఢిల్లీ – కాంగ్రెస్ ఎంపీ, ర‌చ‌యిత శ‌శి థ‌రూర్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మాజీ ప్ర‌ధాని డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ మృతి ప‌ట్ల తీవ్ర విచారం చెందారు. ఆయ‌న అసాధార‌ణ‌మైన వ్య‌క్తిత్వం క‌లిగిన వార‌ని పేర్కొన్నారు. తాను జెనీవాలోని ఐక్య రాజ్య స‌మితిలో ప‌ని చేసిన స‌మ‌యంలో త‌ను సౌత్ క‌మిష‌న్ చైర్మ‌న్ గా ప‌ని చేశార‌ని గుర్తు చేసుకున్నారు. త‌న నుంచి తాను ఎన్నో నేర్చుకున్నాన‌ని తెలిపారు శ‌శి థ‌రూర్.

ఈ స‌మ‌యంలో మ‌న్మోహ‌న్ సింగ్ త‌మ మ‌ధ్య లేక పోవ‌డం త‌న‌ను ఎంతో బాధ‌కు గురి చేస్తోంద‌న్నారు. ప్రధాని అయ్యాక సోనియా గాంధీతో కలిసి నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడంలో కీల‌క పాత్ర పోషించాడ‌ని, ఎన్నో స‌వాళ్ల‌ను దేశం ఎదుర్కొంద‌న్నారు.

మ‌న్మోహ‌న్ సింగ్ మాన‌వ‌త్వం, క‌రుణ‌, ద‌య క‌లిగిన మాన‌వుడ‌ని ప్ర‌శంసించారు ఎంపీ శ‌శి థ‌రూర్. ఓ మ‌హానుభావుడు మ‌నల్ని విడిచి వెళ్లి పోయాడంటూ వాపోయాడు.

ఇదిలా ఉండ‌గా డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ వ‌య‌సు 92 ఏళ్లు. ఆద్యంత‌మూ వివాద ర‌హితుడిగా పేరు పొందారు. ప‌దేళ్ల పాటు పీఎంగా ప‌ని చేశారు. ఆర్థిక మంత్రిగా చెర‌గ‌ని ముద్ర వేశారు. సుదీర్ఘ కాలం పాటు ప‌ని చేసిన ప్ర‌ధాన‌మంత్రుల‌లో ఆయ‌న కూడా ఒక‌రు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *