DEVOTIONAL

ల‌డ్డూ క‌ల్తీపై విచార‌ణ జ‌రిపించాలి – ఎంపీ

Share it with your family & friends

టీడీపీ ఎంపీ శ్రీ భ‌ర‌త్ షాకింగ్ కామెంట్స్

విశాఖ‌ప‌ట్నం – విశాఖ టీడీపీ ఎంపీ శ్రీ భ‌ర‌త్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై శుక్ర‌వారం స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

కోట్లాది మంది భ‌క్తుల మ‌నోభావాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఎంపీ. జాతీయ డెయిరీ సంస్థ ఇచ్చిన నివేదిక‌ను తాను చూశాన‌ని చెప్పారు శ్రీ భ‌ర‌త్. ల‌డ్డూకు సంబంధించి ప‌రీక్ష‌లు చేస్తే అందులో ఉన్న‌ది నెయ్యి కాదు అంత‌కు మించి కొవ్వు ప‌దార్థాలు ఉన్న‌ట్లుగా తేలాయ‌ని తెలిపారు.

పామాయిల్ , ఇత‌ర క‌ల్తీ నూనెలు వాడిన‌ట్లు తేలింద‌న్నారు ఎంపీ శ్రీ భ‌ర‌త్. ఆనాడు వైసీపీ పాల‌కులు ఎప్పుడు స్వచ్ఛమైన నెయ్యి ఇచ్చే నంది సంస్థను ఎందుకు అడ్డుకున్నారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఎంపీ.

వైసిపి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. ఇది చాలా దుర‌దృష్ట‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌గా పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌రు ఈ ఘ‌ట‌న‌పై సీబీఐతో విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరుతున్నార‌ని తెలిపారు శ్రీ భ‌ర‌త్. కూట‌మి ప్ర‌భుత్వం రాక‌తో అస‌లు వాస్త‌వం వెలుగు చూసింద‌న్నారు. ప‌రీక్ష‌లు చేయ‌డంతో అస‌లు వాస్త‌వం వెలుగు చూసింద‌న్నారు.

తిరుపతి తరహా ఘటనలతో మిగిలిన ఆలయాల్లో కూడా పరిక్షించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు శ్రీ భ‌ర‌త్. భీమిలి సమీపంలోని విజయసాయిరెడ్డి కూతురు భూమి కబ్జాలో జరిగిన నిర్మాణాల కూల్చివేత గురించి త‌న‌కు తెలియ‌ద‌న్నారు.