NEWSANDHRA PRADESH

కుమార స్వామితో ఎంపీ శ్రీ భ‌ర‌త్ భేటీ

Share it with your family & friends

విశాఖ ఉక్కు క‌ర్మాగారంపై విస్తృత చ‌ర్చ‌లు

ఢిల్లీ – విశాఖ‌ప‌ట్నం ఎంపీ శ్రీ భ‌ర‌త్ గురువారం మ‌ర్యాద పూర్వ‌కంగా కేంద్ర మంత్రి హెచ్ డి కుమార స్వామితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు ఎంపీ.

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ పరిస్థితిపై ఈరోజు చర్చించారు. రెండవ కొలిమి(ప్లాంట్ )ని పునః ప్రారంభించే అంశంపై కేంద్ర మంత్రి కుమార స్వామి సానుకూలంగా స్పందించార‌ని తెలిపారు ఎంపీ శ్రీ భ‌ర‌త్. ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఈ విష‌యాన్ని పంచుకున్నారు.

దీనిని పునః ప్రారంభించిన‌ట్ల‌యితే మ‌రింత ఉక్కు ఉత్ప‌త్తి జ‌రిగేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుందని తెలిపారు. ఉద్యోగుల శ్రేయస్సుకు తోడ్పడేందుకు, మనో ధైర్యాన్ని బలోపేతం చేయడానికి , పెండింగ్‌లో ఉన్న జీతం సమస్యలను పరిష్కరించాల‌ని ఎంపీ కోరారు.

ఉక్కు కర్మాగారానికి మరింత పటిష్టమైన, దృఢమైన భవిష్యత్తుకు బాటలు వేస్తూ త్వరలోనే ఒక స్పష్టత వస్తుందని కుమార స్వామి హామీ ఇచ్చార‌ని శ్రీ భ‌ర‌త్ వెల్ల‌డించారు.