Saturday, May 24, 2025
HomeNEWSభూముల వేలం ప‌ర్యావ‌ర‌ణం నాశ‌నం

భూముల వేలం ప‌ర్యావ‌ర‌ణం నాశ‌నం

నిప్పులు చెరిగిన ఎంపీ సురేశ్ రెడ్డి

ఢిల్లీ – బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జీరో అవ‌ర్ లో ఆయ‌న పార్ల‌మెంట్ లో హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీకి చెందిన 400 ఎక‌రాల భూముల వేలంపై ప్ర‌స్తావించారు. ఇది పూర్తిగా ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌య‌మ‌న్నారు. కాంగ్రెస స‌ర్కార్ మొండిగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. వేలం పాట వేయ‌డం వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ తింటోంద‌ని వాపోయారు. వందల రకాల జంతు జాతులు, వృక్ష జాతులు ఉన్నాయని, వాటిని కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు. ఇప్పటికే విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. త‌మ పార్టీ వారికి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇస్తోంద‌న్నారు.
వాళ్ళ స్వంత అవసరాల కోసం నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డం లేద‌న్నారు. ఆక్సిజ‌న్ ద‌క్క‌కుండా పోయే ప్ర‌మాదం ఉంద‌న్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన విధంగా బడ్జెట్ లో విద్యారంగానికి 15 శాతానికి బదులు సగం కూడా కేటాయించ లేక పోయిందని ఆరోపించారు మాజీ స్పీక‌ర్ సురేష్ రెడ్డి. అలాగే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణను ఏడో గ్యారెంటీగా చేసి అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందన్నారు.1969 తొలి తెలంగాణ ఉద్యమం ద్వారా 360 మంది ప్రాణాలు పణంగా పెట్టగా ఇందిరాగాంధీ ప్రకటించిన ఆరు సూత్రాలలో భాగంగా హెచ్ సీ యూ 2,300 ఎక‌రాలు కేటాయించింద‌న్నారు. ఇందులో చివ‌ర‌కు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి కాగా 400 ఎక‌రాలు మాత్ర‌మే మిగిలాయ‌న్నారు. ప్ర‌భుత్వం త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments