విశాఖ ఐఐఎం విద్యార్థులకు కంగ్రాట్స్
ప్రశంసించిన ఎంపీ విజయ సాయి రెడ్డి
అమరావతి – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆయన విశాఖ పట్టణంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) ఆధ్వర్యంలో చదువు పూర్తి చేసిన విద్యార్థులు సంచలనంగా మారారు.
ఒక్కొక్కరు ప్రతిష్టాత్మకమైన సంస్థలలో జాబ్స్ సాధించారు. ఒక్కొక్కరు కనీసం రూ. 15 లక్ష లనుంచి 16 లక్షల వేతనాలు పొందారు. విషయం తెలుసుకున్న ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రశంసలు కురిపించారు. స్థానిక ఐఐఎంలో విద్యార్థులు 100 శాతం ప్లేస్ మెంట్ ను సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు .
ఈ సందర్బంగా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా అభినందనలు తెలియ చేస్తున్నానని పేర్కొన్నారు . తమ సర్కార్ విద్యా రంగంపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పిల్లలు కూడా ప్రపంచంతో పోటీ పడాలన్నదే తమ సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని స్పష్టం చేశారు.
చిన్న నగరాల్లో వ్యవస్థాపకతకు సంబంధించిన కొత్త రంగాలను అన్వేషించడానికి వారి నైపుణ్యాలు, ప్రతిభను ఉపయోగించేందుకు దృష్టి సారించాలని ఈ సందర్బంగా సూచించారు వైసీపీ ఎంపీ.