షర్మిలపై విజయ సాయి గుస్సా
ఏపీకి జగన్ సారథ్యంలో భారీగా నిధులు
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తమ సర్కార్ పై, ప్రత్యేకించి సీఎం జగన్ రెడ్డిపై చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి. ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఏపీకి ఎన్ని కోట్లు వచ్చాయో, ఏయే కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయో లెక్కలు తేల్చాలంటూ సవాల్ విసరడం మంచి పద్దతి కాదన్నారు.
అభివృద్ది అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని, ఇప్పటికే వైజాగ్ సమ్మిట్ నిర్వహించడం ద్వారా దాదాపు ఏపీకి రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఆనాడే పూర్తి వివరాలు తెలియడం జరిగిందని పేర్కొన్నారు ఎంపీ.
కొత్తగా ఏపీ పీసీసీ చీఫ్ గా ఎంపికైన షర్మిలా రెడ్డి ఆ మాత్రం తెలుసు కోకుండా నిరాధారంగా ఆరోపణలు చేయడం మంచిది కాదని సూచించారు. తాము అన్ని వివరాలు, కంపెనీలను , పెట్టుబడులను కూడా ప్రజలకు స్పష్టంగా తెలియ చేశామని స్పష్టం చేశారు విజయ సాయి రెడ్డి.
ఆరోపణలు చేసినంత మాత్రాన అవి నిజమై పోవన్నారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న షర్మిలా రెడ్డి అర్థం చేసుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా జనం నమ్మ బోరంటూ ఎద్దేవా చేశారు.