యువతకు భరోసా వైసీపీ ఆసరా
ఎంపీ విజయ సాయిరెడ్డి ప్రకటన
నెల్లూరు జిల్లా – రాష్ట్ర అభివృద్దిలో యువతది కీలకమైన పాత్ర అని స్పష్టం చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి. ఇప్పటికే తాము స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అనేక శిక్షణ కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందన్నారు. ఈసారి మరింత ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు .
నెల్లూరు పార్లమెంటు పరిధిలో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించు కుంటున్న యువ ఓటర్లతో నెల్లూరు రామూర్తినగర్ లోని రామచంద్ర కళ్యాణ మండపంలో మంగళవారం ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి గోపీనాథ్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా యువతను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందజేస్తామన్నారు. నైపుణ్యాభివృద్దిలో భాగంగా టెక్నికల్ , నాన్ టెక్నికల్ గా విభజించి నిరంతర శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ప్రత్యేకించి కేవలం యువత కోసం మేనిఫెస్టోను ప్రకటించామన్నారు విజయ సాయిరెడ్డి. ప్రతి హామీని 100 శాతం అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఎంపీ.