సంచలన నిర్ణయం తీసుకున్న వైసీపీ ఎంపీ
అమరావతి – వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అందరినీ విస్మయ పరిచారు. జనవరి 25న శనివారం తన రాజ్యసభ సభ్వత్వానికి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. ఏ పార్టీ లోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఎవరి ఒత్తిళ్లు లేవన్నారు. చంద్రబాబు ఫ్యామిలీతో వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందన్నారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
ఆయన తీసుకున్న నిర్ణయం వైఎస్సార్సీపీలో కలకలం రేపింది. విజయ సాయి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడే కాదు అనుంగు అనుచరుడు కూడా. గత ప్రభుత్వ హయాంలో ఆయన నెండర్ 2గా వ్యవహరిస్తూ వచ్చారు. ఏ పని చేసినా తనకు తెలియకుండా చేసే వారు కాదు జగన్ రెడ్డి. ఇది ఊహించని షాక్ మాజీ సీఎంకు.
విజయ సాయి రెడ్డి రాజీనామా చేయడం వెనుక ఉన్న కారణాలు ఏమిటనేది ఇప్పటి వరకు తెలియ రాలేదు. ఆయన గత కొంత కాలంగా రాష్ట్రంలో కొలువు తీరిన కూటమి సర్కార్ పై సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు. తనపై కేసులు కూడా నమోదయ్యాయి. దివంగత వైఎస్సార్ ఫ్యామీలికి ఆయన నమ్మిన బంటు. ఆడిటర్ గా తన ప్రస్థానం మొదలైంది.