NEWSANDHRA PRADESH

శ్వేత ప‌త్రాలు బ‌క్వాస్ – ఎంపీ

Share it with your family & friends

విజ‌య సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్

అమ‌రావ‌తి – వైఎస్సార్సీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం వ‌రుస‌గా వివిధ శాఖ‌ల‌కు సంబంధించి శ్వేత ప‌త్రాల‌ను విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. దీనిపై తీవ్రంగా స్పందించారు.

శ‌నివారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఎంపీ విజ‌య సాయి రెడ్డి. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో పూర్తిగా త‌ప్పులు చెప్పించార‌ని ఆరోపించారు. రాష్ట్ర అప్పున‌కు సంబంధించి కేవ‌లం రూ. 7 ల‌క్ష‌ల కోట్లు ఉంటే చంద్ర‌బాబు నాయుడు రూ. 10 ల‌క్ష‌ల కోట్లు ఉందంటూ ఆయ‌నతో అబ‌ద్దాలు చెప్పించారంటూ మండిప‌డ్డారు.

అబ‌ద్దాల‌కు, మోసాల‌కు , దుష్ప్ర‌చారాల‌కు పెట్టింది పేరు నారా చంద్ర‌బాబు నాయుడు అంటూ ఎద్దేవా చేశారు ఎంపీ విజ‌య సాయి రెడ్డి. ఇక‌నైనా వాస్త‌వాలు ప్ర‌జ‌లకు తెలియ చేసేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు.

ఆధారాలు లేకుండా అడ్డ‌గోలుగా ఎదుటి వారిపై బుర‌ద చ‌ల్ల‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు ఎంపీ. ప్ర‌జ‌లకు రాష్ట్రంలో ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదే స‌మ‌యంలో ఎందుకు ఓట్లు వేసి గెలిపించామా అని పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని పేర్కొన్నారు విజ‌య సాయి రెడ్డి.