NEWSANDHRA PRADESH

చేసిన ప‌నులే గుర్తుండి పోతాయి

Share it with your family & friends

ఎంపీ విజ‌య సాయి రెడ్డి కామెంట్

అమ‌రావ‌తి – వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఈ సంద‌ర్బంగా నేత‌లు ఎలా ఉండాలో చెప్ప‌క‌నే చెప్పారు.

బలగం, సైన్యం లేనిదే … “రాముడు” కూడా రావణుడిని చంపలేక పోయాడని గుర్తు చేశారు. వ్యూహం, చాకచక్యం, కపటం లేనిదే …”కృష్ణుడు” కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించలేక పోయాడని అన్నారు విజ‌య సాయి రెడ్డి.

గెలిచిన ప్రతి యుద్ధం వెనక కొంత స్వార్థం, కొంత మోసం, కొంత కపటం కచ్చితంగా ఉంటుందని పేర్కొన్నారు ఎంపీ. గెలిచిన ప్రతివాడు గొప్పవాడు అవుతాడేమో… కానీ, మంచి వాడు మాత్రం కాలేడు అని అన్నారు.

అది చక్రవర్తులైనా … యోగి అయినా రిషి అయినా …. మనిషైనా… నువ్వయినా నేనైనా… ఇది సత్యం అని స్ప‌ష్టం చేశారు. కానీ స్వర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మాత్రం త‌న మంచితనంతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయార‌ని గుర్తు చేసుకున్నారు విజ‌య సాయి రెడ్డి.

ఈ సంద‌ర్బంగా ర‌త‌న్ టాటాను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఆయ‌న చేసిన సేవ‌లే దేశ వ్యాప్తంగా 143 కోట్ల మంది భార‌తీయులు త‌లుచుక‌నేలా చేశాయ‌న్నారు.