పీఎం సంగ్రహాలయ్ భేష్
ఎంపీ విజయ సాయి రెడ్డి
ఢిల్లీ – వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎంపీ స్వయంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి సంగ్రహాలయ్ ను సందర్శించారు. ఈ సందర్బంగా అద్భుతంగా ఉందంటూ కొనియాడారు.
దేశ చరిత్రలో ఇది ఓ గొప్ప ప్రయోగాత్మకమని పేర్కొన్నారు. పీఎం సంగ్రహాలయ్ లో దేశానికి చెందిన చరిత్రతో పాటు ఇప్పటి వరకు దేశాన్ని ఏలిన ప్రధానమంత్రులు, వారి జీవిత విశేషాలు, సాధించిన విజయాల గురించి ఇందులో పొందు పరిచారు.
దీనిని ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడు సందర్శించాలని సూచించారు ఎంపీ. గతంలో ఎంపీలుగా ఎన్నికైన వారు, ప్రస్తుతం కొత్తగా ఎన్నికైన లోక్ సభ సభ్యులు, రాజ్య సభ సభ్యులు విధిగా పీఎం సంగ్రహాలయ్ ను సందర్శించాలని కోరారు విజయ సాయి రెడ్డి.
దీని వల్ల మనం ఎంతో నేర్చుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. భారతదేశపు గొప్ప రాజకీయ చరిత్రలో స్ఫూర్తి దాయకమైన ప్రయాణంగా ఆయన అభివర్ణించారు.