డిమాండ్ చేసిన ఎంపీ విజయ సాయి రెడ్డి
అమరావతి – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి నిప్పులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు కొలువు తీరాక హత్యలు, దారుణాలు, అత్యాచారాలకు కేరాఫ్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అన్నది లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారని, ఆ దిశగానే తను ప్లాన్ చేస్తున్నాడంటూ మండిపడ్డారు.
శనివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు విజయ సాయిరెడ్డి. తప్పుడు ఆరోపణలు చేయడం, ఆధారాలు లేకుండా ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయించడం , ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూడడం పనిగా మారి పోయిందని మండిపడ్డారు ఎంపీ.
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఇవాళ మీకు అధికారం ఉంది కదా అని ఇలాగే వ్యవహరిస్తూ పోతే రేపు ప్రజలు ఛీకొట్టడం ఖాయమని పేర్కొన్నారు విజయ సాయి రెడ్డి. శ్వేత పత్రాలు ప్రకటిస్తూ వస్తున్న నారా చంద్రబాబు నాయుడు ఈ 45 రోజుల తన పాలనలో రాష్ట్రంలో చోటు చేసుకున్న హత్యలు, అత్యాచారాలు, మిస్సింగ్ కేసుల గురించి శ్వేత పత్రం రిలీజ్ చేస్తే బావుంటుందని ఎద్దేవా చేశారు ఎంపీ.