ముంబై టైమ్స్ ఫ్యాషన్ వీక్ లో
ముంబై – నటి, మోడల్ మృణాల్ ఠాకూర్ తళుక్కుమంది. సోమవారం ముంబై వేదికగా ఫ్యాషన్ షో జరిగింది. ఈ షోకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు మోడల్స్. దీనిని ముంబై టైమ్స్ ఫ్యాషన్ వీక్ పేరుతో షో చేపట్టింది. భారీ ఎత్తున ఆదరణ లభించింది.
ఈ ఫ్యాషన్ వీక్ షో ఆద్యంతమూ ఆకట్టుకుంది. ప్రధానంగా నటి మృణాల్ ఠాకూర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ ముద్దుగుమ్మ హొయలు ఒలికించింది. యువకుల మనసు దోచేసింది. వైట్ డ్రెస్ తో అదుర్స్ అనిపించేలా ఆకట్టుకుంది.
ఇదిలా ఉండగా తను టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. ఒకటి దుల్కర్ సల్మాన్ తో , మరొకటి నానితో చేసింది. ఇదిలా ఉండగా ముంబై ఫ్యాషన్ వీక్ సందర్బంగా నటి మృణాల్ ఠాకూర్ మీడియాతో మాట్లాడింది.
సినిమాలలోనే కాదు మోడల్ గా తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం ఈ ముంబై ఫ్యాషన్ వీక్ లో ప్రదర్శించేందుకు దక్కిందన్నారు. తాను ఇవాళ పూర్తి ఆత్మ విశ్వాసంతో పాల్గొన్నానని, ఎందుకంటే మన మీద మనకు నమ్మకం ఉంటేనే ఏదైనా సాధించగలమని పేర్కొంది. మొత్తంగా ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. ఫ్యాషన్ షో తో మరోసారి వార్తల్లోకి ఎక్కారు మృణాల్ ఠాకూర్.