వైసీపీలోకి ముద్రగడ జంప్
కండువా కప్పిన సీఎం జగన్
అమరావతి – మాజీ మంత్రి, ప్రముఖ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు వైసీపీ గూటికి చేరారు. శుక్రవారం తాడేపల్లి గూడెంలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ బాస్ , సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన తనయుడు గిరి కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్నేళ్లుగా కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయాలని పోరాటం చేస్తూ వచ్చిన ముద్రగడ పద్మనాభంను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు కేవలం మాటల వరకే పరిమితం అయ్యారని, కానీ తాము పవర్ లోకి వచ్చాక అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయడం జరిగిందన్నారు.
ముద్రగడ పద్మనాభం గతంలో మంత్రిగా పని చేశారని, ఆయన పోరాటం, రాజకీయ అనుభవం తమ పార్టీకి ఎంతగానో ఉపయోగ పడుతుందని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి. ఆయన చేరడం తనకు సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మంచి పదవి దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం.