కూతురుతో తిట్టిస్తే పట్టించుకోను
స్పష్టం చేసిన కాపు నేత పద్మనాభం
అమరావతి – ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం సీరియస్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన కూతురు క్రాంతి తనపై చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు. తన కూతురుకు పెళ్లి అయ్యిందని, ఆమెకు తల్లి గారింటితో సంబంధం లేదన్నారు. తను పెళ్లి కాక ముందు వరకే తన ప్రాపర్టీ అని, ఇప్పుడు ఆమె మెట్టినిల్లే ప్రాపర్టీ అని పేర్కొన్నారు.
కొంత మంది కావాలని తన కూతురును అడ్డం పెట్టుకుని తనను తిట్టించే ప్రయత్నం చేశారని, కానీ కాలమే అన్నింటికి సమాధానం చెబుతుందన్నారు. అవగాహన రాహిత్యంతో ఎలా పడితే అలా మాట్లాడటం సంస్కారం కాదన్నారు ముద్రగడ పద్మనాభం.
తానేమిటో తన సత్తా ఏమిటో, రాజకీయాలలో తనకు ఉన్న నిబద్దత ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. దారుణంగా తిట్టించడం తనను మరింత బాధకు గురి చేసిందన్నారు. రాజకీయం రాజకీయమేనని, కూతురు కూతురేనని స్పష్టం చేశారు. ఏది ఏమైనా..ఆరు నూరైనా సరే రాష్ట్రంలో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని, జగన్ రెడ్డి మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు ముద్రగడ పద్మనాభం.