కాపులు కాదు కరివే పాకులు
నిప్పులు చెరిగిన ముద్రగడ
అమరావతి – ప్రముఖ కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిప్పులు చెరిగారు. ఆయన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ లను ఏకి పారేశారు. ఇక బీజేపీ ఉన్నా లేనట్టేనంటూ ఎద్దేవా చేశారు. గత కొంత కాలంగా ముద్రగడ కాపుల కోసం ఉద్యమిస్తున్నారు. ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు కాపుల పేరుతో మోసం చేశాడని ఆరోపించారు. ముద్రగడ పద్మనాభం మీడియాతో మాట్లాడారు. తాను నిఖార్సయిన ఉద్యమ నాయకుడినని స్పష్టం చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కీలకం కానున్నాయని, అందుకే కాపు జపం చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రజలు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ లను నమ్మే స్థితిలో లేరని ధ్వజమెత్తారు.
ఒకరేమో కమ్మ వారికి రాజ్యాధికారం కట్టబెట్టాలని కష్ట పడుతున్నారని, ఇంకొకరేమో వారిని కరివే పాకుల కంటే అధ్వాన్నంగా చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాబు, పవన్ లు ఇద్దరూ డేంజర్ అంటూ హెచ్చరించారు. ఇదిలా ఉండగా ముద్రగడ పద్మనాభం ఈనెల జగన్ రెడ్డి సమక్షంలో 14న వైసీపీ కండువా కప్పుకోనున్నారు.