కాపుల కోసం పవన్ ఏం చేశాడు
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం
అమరావతి – కాపు ఉద్యమ ప్రముఖ నేత ముద్రగడ పద్మనాభం షాకింగ్ కామెంట్స్ చేశారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. ముద్రగడ మీడియాతో మాట్లాడారు. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు జనసేన పార్టీ చీఫ్ కు లేదన్నారు.
కాపుల పరిరక్షణ కోసం , వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏనాడైనా పవన్ పోరాటం చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా సామాజిక వర్గంగా ఉన్న కాపులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక ఎంపీ, ఎమ్మెల్యే లేకుండా పార్టీ పెడితే తాను ఎలా వెళతానని ప్రశ్నించారు. ఆనాడు ప్రజారాజ్యం పెట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ఘనత తన అన్న చిరంజీవికి దక్కుతుందన్నారు. ఇక బీరాలు పలికిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడి పోయాడని ధ్వజమెత్తారు. కాపు ఉద్యమం వల్ల తాను నష్ట పోయానని ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం.
చంద్రబాబు నాయుడు తనను చాలా ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు. జగన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ కు మధ్య చాలా తేడా ఉందన్నారు. కనీసం 30 ఏళ్లు సీఎంగా జగన్ ఉంటాడని జోష్యం చెప్పారు. 20 సీట్ల కోసం తాను ఎందుకు సపోర్ట్ చేయాలని ప్రశ్నించారు.