NEWSANDHRA PRADESH

కూతురు స‌రే నీ భార్య‌ల సంగతేంటి

Share it with your family & friends

వైసీపీ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం

కాకినాడి జిల్లా – వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఏపీ కాపు నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను బ‌ద్నాం చేసినంత మాత్రాన త‌న‌కు వ‌చ్చే న‌ష్టం ఏమీ లేద‌న్నారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న కూతురుతో త‌న‌ను తిట్టించినంత మాత్రాన త‌న‌కు బాధ క‌ల‌గ‌డం లేద‌ని చెప్పారు.

పెండ్లి కానంత వ‌ర‌కు త‌న కూతురు అని, త‌నకు పెళ్ల‌యింద‌ని ఆమె ఇప్పుడు అత్తింటి వారి బిడ్డ అని స్ప‌ష్టం చేశారు. తాను ఇప్ప‌టి వ‌ర‌కు త‌న బిడ్డ‌కు ఏం త‌క్కువ చేశాన‌ని ప్ర‌శ్నించారు. కొంద‌రు కావాల‌ని త‌న క్యారెక్ట‌ర్ ను దెబ్బ కొట్టాల‌ని ఇలాంటి చ‌వ‌క‌బారు ప్ర‌క‌ట‌న‌లు చేయిస్తున్నారంటూ ఆరోపించారు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.

త‌మ కుటుంబాన్ని కాదు మీ కుటుంబాల్లో భ‌రోసా క‌ల్పించుకుంటే మంచిద‌ని సూచించారు. ఎవ‌రు ఎవ‌రి మాయ‌లో ప‌డ్డారో ముందు ఆలోచించుకుంటే మంచిద‌ని అన్నారు. కుటుంబాల‌ను రాజ‌కీయాల్లోకి లాగడం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని నిల‌దీశారు.

నా కూతురు సంగ‌తి స‌రే ముందు నీ భార్య‌ల గురించి నీవు వివ‌రాలు బ‌య‌ట‌కు చెప్ప‌గ‌ల‌వా , అంత ద‌మ్ముందా అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఉద్దేశించి ప్ర‌శ్‌నించారు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.