మోదీపై ముఫ్తీ షాకింగ్ కామెంట్స్
ముఫ్తీ తారిక్ మసూద్ ఫైర్
పాకిస్తాన్ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పాకిస్తానీయులు భగ్గుమంటున్నారు. ప్రధానంగా ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్తాన్ కు చుక్కలు చూపించారు పీఎం. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు చోటు కల్పించిన ఆ దేశం పదే పదే తమ వద్ద లేడంటూ నమ్మ బలికే ప్రయత్నం చేసింది. మరో వైపు అతడిని భారత్ కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే భారత రక్షణ శాఖ సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ ఉన్నంత వరకు కంటి మీద కునుకే ఉండదని సమాచారం.
పలువురు పేరు మోసిన ఉగ్రవాదులంతా ఒక్కరొక్కరుగా పాకిస్తాన్ లో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఎవరు చేస్తున్నారని తెలుసు కునేందుకు నానా తంటాలు పడుతోంది ఆ దేశం . ఇదే సమయంలో పాకిస్తాన్ ఆర్మీ , ఆ దేశ అధ్యక్షుడు భారత్ పై మండిపడుతున్నారు. ఇదంతా మోదీ నిర్వాకమేనంటూ పేర్కొంటున్నారు.
అయితే మోదీ ఆదేశాల మేరకే రా ఈ పని చేస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ కు చెందిన వివాదాస్పద ఇస్లామిక్ పండితుడు ముఫ్తీ తారిక్ మసూద్ కీలక వ్యాఖ్యలు చేశారు మోదీని ఉద్దేశించింది. తనకు వీసా ఇవ్వకుండా నిలిపి వేశారని, ఆయన వల్లనే తాను పెళ్లి చేసుకోలేక పోయానని ఆరోపించారు.