బంగ్లాదేశ్ సలహాదారుగా ముహమ్మద్ యూనస్
ప్రకటించిన బంగ్లాదేశ్ విద్యార్థుల కమిటీ
బంగ్లాదేశ్ – ప్రముఖ నోబెల్ పురస్కార గ్రహీత డాక్టర్ ముహమ్మద్ యూనస్ ను బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని అక్కడ పోరాటం చేస్తున్న విద్యార్థుల కమిటీ ప్రకటించింది.
బుధవారం విద్యార్థుల కమిటీ మీడియాతో మాట్లాడింది. గత కొన్నేళ్లుగా బంగ్లాదేశ్ ఉక్కు పాదాల కింద నలిగి పోయిందని వాపోయారు విద్యార్థులు. వివక్షకు వ్యతిరేకంగా సమన్వయకర్తలను నియమించడం జరిగిందని చెప్పారు.
చాలా మంది ఈ పోరాటంలో అమరులయ్యారని, కొత్త బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించామని అన్నారు. ఆ వాగ్ధానాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే తామందరి తరపున నోబెల్ గ్రహీతను సలహాదారుగా నియమించడం జరిగిందని చెప్పారు.
విద్యార్థులు, పౌరులు ప్రతిపాదించిన ప్రభుత్వాన్ని తప్ప మరే ఇతర ప్రభుత్వాన్ని తాము అంగీకరించ బోమంటూ ప్రకటించారు. ఇప్పటికీ దేవాలయాలు, ఇతరులపై దాడులు కొనసాగుతున్నాయని దీనిని తాము ఒప్పుకోబోమన్నారు.
24 గంటల్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, శాంతి భద్రతలను కాపాడేందుకు రాష్ట్రపతి సహకరించాలని కోరారు విద్యార్థులు.