NEWSNATIONAL

సూర‌త్ లో బీజేపీ బోణీ

Share it with your family & friends

కాంగ్రెస్ అభ్య‌ర్థి ఫారం తిర‌స్క‌ర‌ణ

గుజ‌రాత్ – ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి తీపి క‌బురు చెప్పింది బీజేపీ. ఆయ‌న చెబుతున్న‌ట్టుగానే ఇంకా ఫలితాలు వెలువ‌డ‌క ముందే ఊహించ‌ని రీతిలో ఓ సీటు ద‌క్కేలా చేసింది. గుజ‌రాత్ లోని సూర‌త్ ఎంపీ సీటుకు సంబంధించి బీజేపీ అభ్య‌ర్థి ముఖేష్ ద‌లాల్ విజ‌యం సాధించడం విశేషం. ఇక్క‌డ ఎలాంటి పోలింగ్ జ‌ర‌గ‌లేదు.

కానీ ప్ర‌ధాన ప్ర‌త్యర్థిగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్య‌ర్థి నీలేష్ కుంభానీ త‌ను స‌మ‌ర్పించిన బి ఫారంలో త‌ప్పులు ఉన్నాయంటూ ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న అభ్య‌ర్థిత్వం చెల్లుబాటు కాదంటూ స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా సూర‌త్ లోక్ స‌భ స్థానంలో పోటీలో ఉన్న మిగ‌తా అభ్య‌ర్థులు తాము బ‌రిలో ఉండ‌లేమంటూ త‌మ నామినేష‌న్లు ఉప‌సంహ‌రించు కుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో బీజేపీ అభ్య‌ర్థి బి ఫారం ఓకే కావ‌డంతో , ఆయ‌న సంత‌కాలు స‌రిగా ఉండ‌డంతో విజేతగా ముఖేష్ ద‌లాల్ గెలుపొందిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు. దీంతో దేశంలోనే తొలి సీటును బీజేపీ కైవ‌సం చేసుకుంది. తొలి విడ‌త ఎన్నిక‌లు ముగిశాయి. ఇంకా ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది.