టాలీవుడ్ అభివృద్దికి కాంగ్రెసే కారణం
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్ – తెలుగు చిత్రసీమకు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని అనుబంధం ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అందులో పని చేస్తున్న వారి పట్ల తమకు ఎలాంటి ద్వేషం లేదన్నారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందని స్పష్టం చేశారు.
శనివారం పీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారాన్ని తమకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం మంచి పద్దతి కాదన్నారు మహేష్ కుమార్ గౌడ్.
తమకు బన్నీకి ఎందుకు విభేదాలు ఉంటాయని ప్రశ్నించారు. విచిత్రం ఏమిటంటే తన మామ తమ పార్టీకి చెందిన వ్యక్తి అని తెలిపారు. సీఎం భార్యకు బన్నీ భార్య స్నేహా రెడ్డికి మధ్య బంధుత్వం ఉందన్నారు. ఆ విషయం తెలుసుకోకుండా ఇలాంటి చవకబారు విమర్శలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వం తప్పు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తి అంటూ ఉండదన్నారు మహేష్ కుమార్ గౌడ్.