స్ట్రాంగ్ రూమ్ లలో ఈవీఎంలు భద్రం
ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా
అమరావతి -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యనిర్వహణ అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై స్పందించారు. 3,500 పోలింగ్ కేంద్రాలలో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ జరిగిందని చెప్పారు.
ఆఖరి పోలింగ్ కేంద్రంలో అర్ధరాత్రి 2 గంటలకు పోలింగ్ పూర్తయిందని స్పష్టం చేశారు ముఖేష్ కుమార్ మీనా. ఓటర్లు కొందరు అసెంబ్లీకి ఓటు వేశారని కానీ లోక్ సభకు ఓటు వేయలేదని పేర్కొన్నారు. ఇంకొందరు లోక్ సభకు వేసి శాసన సభ ఎన్నికలకు సంబంధించి ఓటు వేయలేదని స్పష్టం చేశారు సీఈవో.
ఇప్పటి వరకు 350 స్ట్రాంగ్ రూమ్ లలో ఈవీఎంలను భద్ర పర్చడం జరిగిందని చెప్పారు. పార్లమెంట్ కు సంబంధించి 3 కోట్ల 33 లక్షల 4560 మంది ఓటు హక్కు వినియోగించు కున్నారని వెల్లడించారు ముఖేష్ కుమార్ మీనా. కొన్ని చెదురు మదురు సంఘటనలు మినహా భారీ ఎత్తున దాడులు జరగలేదన్నారు సీఈవో.