ముంబై ఇండియన్స్ ఫైనల్ స్క్వాడ్
ప్రధాన ఆటగాళ్లపైనే ఫ్రాంచైజ్ గురి
ముంబై – టినా అంబానీ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ వేలంలో కీలకమైన ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. వారిలో తిలక్ వర్మతో పాటు సూర్య కుమార్ యాదవ్ ఉన్నారు. ట్రెంట్ బౌల్ట్ ను రూ. 12.5 కోట్లకు, నమన్ ధీర్ ను రూ. 5.25 కోట్లకు, రాబిన్ మింజ్ ను రూ. 65 లక్షలకు, కరణ్ శర్మన్ రూ. 50 లక్షలకు తీసుకుంది.
ఇక రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో స్పీడ్ స్టర్ బుమ్రాను రూ. 18 కోట్లకు, హార్దిక్ పాండ్యాను రూ. 16.35 కోట్లకు ఉంచుకుంది. ఇక ఐపీఎల్ చరిత్రలో తొలి గిరిజన ఆటగాడు రాబిన్ మింజ్ ను జట్టు రూ. 65 లక్షలకు స్వంతం చేసుకుంది. గతంలో గుజరాత్ టైటాన్స్ తో గాయం కారణంగా 2024 సీజన్ కు దూరమయ్యాడు. కానీ ఈసారి ముంబైకి చిక్కాడు.
వీరితో పాటు రోహిత్ శర్మ రూ. 16.3 కోట్లు, తిలక్ వర్మను రూ. 8 కోట్లకు, ర్యాన్ రికెల్టన్ ను రూ. ఒక కోటికి, అల్లా గజన్ పర్ రూ. 4.80 కోట్లకు, దీపక్ చాహర్ ను రూ. 9.25 కోట్లకు, విల్ జాక్స్ ను రూ. 5.35 కోట్లకు, అశ్విని కుమార్ ను రూ. 30 లక్షలకు, మిచెల్ సాంట్నర్ ను రూ. 2 కోట్లకు, రీస్ టాప్లీని రూ. 75 లక్షలకు, శ్రీజిత్ కృష్ణన్ ను రూ. 2.60 కోట్లకు, రాజ్ అంగద్ బావా ను రూ. 30 లక్షలకు, సత్య నారాయణ రాజును రూ. 30 లక్షలకు, బెవాన్ జాకబ్స్ ను రూ. 30 లక్షలకు, అర్జున్ టెండూల్కర్ ను రూ. 30 లక్షలు, విలియమ్స్ ను రూ. 70 లక్షలు, విఘ్నేష్ పుత్తూరును రూ. 30 లక్షలకు తీసుకుంది ముంబై ఇండియన్స్ .