ముంతాజ్ పటేల్ షాకింగ్ కామెంట్స్
గుజరాత్ లో లా అండ్ ఆర్డర్ ఫెయిల్
గుజరాత్ – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ముంతాజ్ పటేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె శనివారం గుజరాత్ లోని భరూచ్ లో జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందారు.
శాంతి భద్రతలను కాపాడడంలో బీజేపీ సర్కార్ పూర్తిగా విఫలం చెందిందని ధ్వజమెత్తారు ముంతాజ్ పటేల్.
ఇటీవలే రెండు ప్రధాన ఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు. దాహోద్‌లో పాఠశాల నుంచి
ఇంటికి వెళ్తున్న ఆరేళ్ల బాలికను ప్రిన్సాపల్ కారులో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడనని ఆవేదన చెందారు. ఇదే సమయంలో ఎవరికీ తెలియకుండా చంపాడని వాపోయారు.
భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలలో ఇలాంటి ఘటనలు జరిగితే తొలుత గొంతు విప్పేది, ఆరోపణలు చేసేది భారతీయ జనతా పార్టీ ముందుంటుందని అన్నారు. కానీ గుజరాత్ లో ఇలాంటి ఘటనలు ప్రతి చోటా జరుగుతూనే ఉన్నాయని , కానీ వీటికి వ్యతిరేకంగా ఎవరూ గొంతు విప్పడం లేదని అన్నారు.