కోదండ రాముడి కటాక్షం
ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి – తిరుపతి లోని శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజు రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామివారు భక్తులను కటాక్షించారు.
గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, డెప్యూటీ ఈవోలు గోవింద రాజన్, నాగరత్న, విజివో బాలి రెడ్డి, ఏఈవో పార్థసారధి, సూపరింటెండెంట్ సోమశేఖర్, కంకణ భట్టర్ సీతారామాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు చలపతి, సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఈ ఆలయంలో ప్రతి ఏటా కోదండ రాముడి బ్రహ్మోత్సవాలు కొనసాగుతుండడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ సకల సదుపాయాలు ఏర్పాటు చేసింది.