Tuesday, April 22, 2025
HomeNEWSANDHRA PRADESHచంద్ర‌బాబు నాయుడే నాకు స్పూర్తి

చంద్ర‌బాబు నాయుడే నాకు స్పూర్తి

భార్య నారా భువ‌నేశ్వ‌రి కామెంట్స్

చిత్తూరు జిల్లా – పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే విజయం మన సొంతమవుతుందని , ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడితే ఏదైనా సాధించవచ్చని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. మన దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందన్నారు.

కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో గురువారం ముఖాముఖి నిర్వహించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని చెప్పారు.

విద్యార్థులను చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయని అన్నారు. నేను మీలాగే సరదాగా గడిపాను. కాలేజ్ డేస్ లైఫ్ అంతా గుర్తుంటాయి. నేను చదువుకుంటూ ఉండగా 19 ఏళ్లకే పెళ్లి చేశారు. నాకు ఆ వయసులో ఏమీ తెలీదు. నా భర్త చంద్రబాబు నాపై నమ్మకంతో హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారని చెప్పారు. ఒక చాలెంజ్ గా తీసుకుని పని చేశాన‌ని అన్నారు.

ఆట పాటలే కాదు కెరీర్ పైనా విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. విజయం ఊరికే ఏమీ రాదు..కష్ట పడకుండా వచ్చేది ఏదీ నిలబడదన్నారు. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఉన్నత స్థానాలకు మనం చేరుకోగలమని అన్నారు. విజయానికి షార్ట్ కట్ లేదు. విద్యార్థి దశ నుంచే లక్ష్యంతో ముందుకెళితే అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పారు నారా భువ‌నేశ్వ‌రి. త‌న‌తో పాటు త‌న కొడుకు నారా లోకేష్ దీనినే న‌మ్ముకుని ముందుకు వెళుతున్నామ‌ని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments