Wednesday, April 9, 2025
HomeNEWSANDHRA PRADESHనా భ‌ర్త అరెస్ట్ అక్ర‌మం - పంక‌జ శ్రీ‌

నా భ‌ర్త అరెస్ట్ అక్ర‌మం – పంక‌జ శ్రీ‌

వ‌ల్ల‌భ‌నేని వంశీకి 14 రోజుల రిమాండ్

విజ‌య‌వాడ – గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని అక్ర‌మంగా అరెస్ట్ చేశారంటూ త‌న భార్య పంక‌జ శ్రీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకోవ‌డం ప‌ట్ల ఫైర్ అయ్యారు. ఉన్న‌త న్యాయ స్థానంలో పోరాటం చేస్తాన‌ని అన్నారు. కూట‌మి స‌ర్కార్ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోందంటూ మండిప‌డ్డారు. నా పోరాటం న్యాయ‌బ‌ద్దంగా ఉంటుంద‌న్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోందంటూ ఫైర్ అయ్యారు.

ఇదిలా ఉండ‌గా గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఆయ‌న‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు న‌మోదు చేశారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంపై దాడికి ప్రోత్స‌హించిన ఘ‌ట‌న‌లో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం దీనిని సీరియ‌స్ గా తీసుకుంది. పోలీసులు నోటీసులు జారీ చేసినా ప‌ట్టించుకోక పోవ‌డంతో హైద‌రాబాద్ లో ఉంటున్న వంశీని అదుపులోకి తీసుకున్నారు.

వ‌ల్ల‌భ‌నేని వంశీతో పాటు ల‌క్ష్మీప‌తి, కృష్ణ‌ప్ర‌సాద్ కు కూడా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వీరిని విజ‌య‌వాడ లోని జిల్లా జైలుకు త‌ర‌లించారు. గ‌చ్చిబౌలి నుంచి భారీ భ‌ద్ర‌త మ‌ధ్య వంశీని బెజ‌వాడ‌లోని కృష్ణ‌లంక పోలీస్ స్టేష‌న్ నుంచి జీజీహెచ్ కు త‌ర‌లించారు. దాదాపు 8 గంట‌ల‌కు పైగా వంశీని ప్ర‌శ్నించారు పోలీసులు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments