మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
హైదరాబాద్ – ఆత్మహత్యకు పాల్పడిన రియల్టర్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని సందర్శించారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. సీఎం ఆదేశాల మేరకు తాను ఇక్కడికి వచ్చానని అన్నారు. కుటుంబానికి ఇబ్బందులు లేకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా కూతురుకు ప్రభుత్వ పరంగా జాబ్ ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. హైడ్రా కూడా ఆలోచించాలని అన్నారు.
మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు మైనంపల్లి హనుమంతరావు. రియల్ ఎస్టేట్ పరంగా కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని, హైడ్రాను మంచి పని కోసం తీసుకు రావడం జరిగిందన్నారు. ఒక కార్యక్రమాన్ని తీసుకు వస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు రావడం సహజమేనని అన్నారు.
విపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు మాజీ ఎమ్మెల్యే. వేణుగోపాల్ రెడ్డి చనిపోతూ తన పేరుతో కూడా లెటర్ రాయడం తెలిసిందన్నారు. ఏది ఏమైనా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఇలా జరిగి ఉండేది కాదన్నారు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో తెలియ లేదన్నారు మైనంపల్లి.