NEWSTELANGANA

హ‌రీశ్ రావుకు మైనంప‌ల్లి స్ట్రాంగ్ వార్నింగ్

Share it with your family & friends

మూసీ నిర్వాసితుల‌ను రెచ్చ‌గొడితే ఎలా

హైద‌రాబాద్ – కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత్ రావు నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావును ఏకి పారేశారు. మంగ‌ళ‌వారం మైనంప‌ల్లి మీడియాతో మాట్లాడారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు. లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు హ‌రీశ్ రావును.

రెండు రోజుల పాటు టైం ఇస్తున్నాన‌ని, ఆ లోపు త‌న తీరును మార్చు కోవాల‌ని లేక పోతే హ‌రీశ్ రావు ఆఫీసును ముట్టిస్తాన‌ని పేర్కొన్నారు. మూసీ నిర్వాసితుల‌ను కావాల‌ని రెచ్చ‌గొడుతున్నార‌ని ఆరోపించారు. దీనిని ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నార‌ని పేర్కొన్నారు.

ఇప్ప‌టికే 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న‌ది చాల‌క ఏమీ ఎర‌గ‌న‌ట్టు తిరిగి బాధితుల‌కు అండ‌గా ఉంటామ‌నే నెపంతో దివాళాకోరు రాజ‌కీయాల‌కు తెర లేపాడంటూ ధ్వ‌జ‌మెత్తారు మైనంప‌ల్లి హ‌నుమంత రావు. త‌మ ప్ర‌భుత్వం మూసీ రివ‌ర్స్ ఫ్రంట్ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింద‌న్నారు. ఎవ‌రికీ ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటుంటే నిర్వాసితుల‌ను రెచ్చ‌గొట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.