DEVOTIONAL

తిరుమ‌ల‌లో ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు

Share it with your family & friends

అంగ‌రంగ వైభ‌వోపేతంగా బ్రహ్మోత్స‌వాలు

తిరుమల – శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో రెండ‌వ‌ రోజైన శ‌నివారం రాత్రి హంస వాహ‌న సేవ‌లో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం కలిగించాయి. ఐదు రాష్ట్రాలకు చెందిన కళాకారులు 18 క‌ళాబృందాలు 511 మంది క‌ళాకారులు ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చారు.

తిరుప‌తి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే భరత నాట్యం, మహారాష్ట్రకు చెందిన గీతా బృందం కథక్ నృత్యం ప్రదర్శించారు. కర్నాటకకు చెందిన డాక్టర్ రక్షాకార్తిక్ దీప నృత్యం కనువిందు చేసింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన అజయ్ బృందం తప్ప నృత్యంతోను, బెంగళూరుకు చెందిన సుజేంద్ర బాబు బృందం దశావతారం రూపకంతోను అలరించారు.

మహారాష్ట్రకు చెందిన నరేంద్ర బృందం బంగ్రా నృత్యంతోను, హైదరాబాద్ కు చెందిన అర్చన బృందం పద్మావతీ పరిణయంతోను, బెంగళూరు చెందిన అనన్య బృందం కాళింగ మర్ధనం రూపకంతోను, బెంగళూరుకు చెందిన తరుణారెడ్డి బృందం మయూర నృత్యంతోను, కర్నాటకకు చెందిన విజయలక్ష్మి బృందం కురవంజి నృత్యం తో ఆక‌ట్టుకున్నారు.

ఇక కర్నాటకకు చెందిన మహేష్ కూమార్ డొల్లుకునిత కళా విన్యాసంతోను, రాజస్థాన్ కు చెందిన రామ్ బృందం నౌవ్ర్ట కళా విన్యాసంతోను, తమిళనాడుకు చెందిన ధరణి కశ్యప్ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనతోను, తిరుపతి పట్టణానికి చెందిన డాక్టర్ మురళీ కృష్ణ బృందం మోహినియాట్టంతోను, తూర్పు గోదావరి, హైదరాబాద్, తిరుపతికి చెందిన వీరవేణి, శివలక్ష్మీ, తులసీపద్మ, బృందాలు కోలాటాలతో అలరించారు.