12 వేల థియేటర్లలో పుష్ప 2 మూవీ
ప్రకటించిన చిత్ర నిర్మాతలు
ముంబై – మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో డైనమిక్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలిసి నటించిన పుష్ప 2 ది రూల్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే ఈ చిత్రం రూ. 1,000 కోట్లను వసూలు చేయడం విశేషం. ఇది ఓ రికార్డ్ కూడా. సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. శుక్రవారం ముంబై వేదికగా పుష్ప 2 మూవీ యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు నవీన్, రవి ఎర్నేని కీలక ప్రకటన చేశారు. పుష్ప 2 మూవీని వచ్చే నెల డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా 12,000 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది దేశ సినీ చరిత్రలో ఓ రికార్డ్ అని తెలిపారు నవీన్ ఎర్నేని.
ఇదిలా ఉండగా ఈసారి పుష్ప 2 అన్ని సినిమాల రికార్డులను తిరగ రాయడం ఖాయమని ప్రకటించారు ప్రముఖ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.