మన్మోహన్ నిర్ణయం ప్రశంసనీయం
మాజీ మంత్రి ఎన్ . రఘువీరా రెడ్డి
అమరావతి – మాజీ ఏపీ పీసీసీ చీఫ్ నీలకంఠాపురం రఘువీరా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ట్విట్టర్ వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత దేశానికి చేసిన సేవల గురించి కొనియడారు.
ప్రధానంగా దేశం అత్యంత క్లిష్ట సమయంలో ఉన్న తరుణంలో ఆపద్భాంధవుడిగా ఆదుకున్న ఘనత మాజీ ప్రధానమంత్రికి దక్కుతుందని పేర్కొన్నారు. అంతే కాదు డాక్టర్ మన్మోహన్ సింగ్ వివిధ హోదాలలో 33 ఏళ్ల పాటు సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన చేసిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు.
ఆర్థిక సంక్షోభం నెలకొన్న తరుణంలో దేశాన్ని కాపాడిన గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ అంటూ ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన ఆర్థిక వేత్తలలో ఒకడిగా గుర్తింపు పొందారని , ప్రశంసలు అందుకున్నారని తెలిపారు నీలకంఠాపురం రఘువీరా రెడ్డి.
ఇదిలా ఉండగా డాక్టర్ మన్మోహన్ సింగ్ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పడం ఆయన ఎంత గొప్ప నాయకుడో తెలియ చేస్తుందని పేర్కొన్నారు మాజీ మంత్రి.