మాజీ మంత్రి రఘువీరా రెడ్డి
మడకశిర – మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ నీలకంఠాపురం రఘువీరా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మడకశిరలో పార్టీ పరంగా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రసంగించారు రఘువీరా రెడ్డి. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలకమైన పాత్ర పోషించ బోతోందని చెప్పారు.
మడకశిర తనకు రాజకీయంగా జన్మనిచ్చింది అంటూ కితాబు ఇచ్చారు. ఈ నియోజకవర్గం రిజర్వుడు కావడంతో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఆయనను గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందన్నారు నీలకంఠాపురం రఘువీరా రెడ్డి.
తమను గెలిపిస్తే 50 సంవత్సరాలకు సరిపడా అభివృద్ది చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పాలన గతి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
జగన్ రెడ్డి నిర్ణయాలు జనం పాలిట శాపంగా మారాయని ఆరోపించారు మాజీ మంత్రి. అమరావతి పేరుతో చంద్రబాబు, మూడు రాజధానుల పేరుతో జగన్ రెడ్డి రాజకీయాలు చేస్తూ వచ్చారని ఆరోపించారు.