NEWSANDHRA PRADESH

ప‌రిశోధ‌నాత్మ‌క జ‌ర్న‌లిజానికి ప్ర‌తీక‌

Share it with your family & friends

రామోజీరావుపై ఎన్ రామ్ ప్ర‌శంస‌

అమ‌రావ‌తి – ఈనాడు సంస్థ‌ల అధిప‌తి , దివంగ‌త రామోజీరావు గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు ది హిందూ ప‌త్రిక మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఎన్ . రామ్. రామోజీరావు సంస్మ‌ర‌ణ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన స‌మావేశానికి ఆయ‌న హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా రామోజీరావుతో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. రామోజీరావు మోస్ట్ పాపుల‌ర్ అని పేర్కొన్నారు. ఆయ‌న ప‌రిశోధ‌నాత్మ‌క జ‌ర్న‌లిజాన్ని న‌మ్మే వార‌ని చెప్పారు. అప్పట్లో దేశ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉండేవని అన్నారు.

రాజీవ్ గాంధీ ప్రభుత్వం తెచ్చిన పరువు నష్టం బిల్లులో కఠిన నిబంధనలు పెట్టారని తెలిపారు. పాత్రికేయులే లక్ష్యంగా కఠిన నిబంధనలు రూపొందించారు. పరువు నష్టం బిల్లుపై ఎడిటర్స్‌ గిల్డ్‌ అధ్యక్షుడిగా రామోజీ పోరాడారని ప్ర‌శంసించారు.

ఆయన పోరాటం ఫలితంగా ఆ బిల్లును వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. ఈనాడు పత్రిక సమాజంలోని క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పట్టిందన్నారు ఈనాడు ప్రస్థానంపై ఆస్ట్రేలియన్‌ రాజకీయవేత్త రాబిన్‌ జెఫ్రీ పుస్తకం రాశారని గుర్తు చేశారు.