కేజ్రీవాల్ అరెస్ట్ పై హెగ్డే కామెంట్స్
మాజీ న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
కర్ణాటక – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడంపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మాజీ సొలిసిటర్ జనరల్ జస్టిస్ ఎన్ సంతోష్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ తో కలిసి ఆప్ ఉద్యమంలో పాల్గొన్నారు. పలు సూచనలు కూడా చేశారు.
తాను కలలో కూడా కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారని అనుకోలేదన్నారు. ఇది ఎంత మాత్రం జీర్ణించు కోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశాబ్దం కిందట ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారేతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు.
విచిత్రం ఏమిటంటే ఒక విజన్ కలిగిన నాయకుడు ఇలా మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ కావడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు జస్టిస్ ఎన్ సంతోష్ హెగ్డే. ఈ సందర్బంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. అధికారంలో ఉన్న సమయంలో దురాశ అనేది మనల్ని అధిగమించేలా చేస్తుందన్నారు.
ప్రజలకు ఆదర్శ ప్రాయంగా ఉండాల్సిన వాళ్లు ఇలా ఒక్కరొక్కరు కేసులలో ఇరుక్కోవడం తనను కలిచి వేస్తోందన్నారు.