కందిపప్పు..చక్కెర ధరలు తగ్గింపు – నాదెండ్ల
ప్రకటించిన టీడీపీ కూటమి ప్రభుత్వం
అమరావతి – ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కందిపప్పు, చక్కెర ధరలు తగ్గించినట్లు తెలిపారు.
నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకి సామాన్య ప్రజలు సతమతమవుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు నాదెండ్ల మనోహర్.
బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.180 (కేజీ) అమ్ముతున్న కందిపప్పు ధరను ఒకే నెలలో రెండు సార్లు నియంత్రించడం జరిగిందన్నారు. ఇప్పటికే 160 రూపాయలు, 150 రూపాయలకు తగ్గించి అందించడం జరిగిందన్నారు మంత్రి.
ఇపుడు తాజాగా రూ.67కే కిలో కందిపప్పు, 17 రూపాయలకే అరకేజీ చక్కెర పంపిణీకి శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. తెనాలిలో మనోహర్ కందిపప్పు, చక్కెర పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 1.49 కోట్ల రేషన్ కార్డుదారులకు కందిపప్పు, చక్కెర అందజేస్తామన్నారు మనోహర్.
దీని ద్వారా నాలుగు కోట్ల 32 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. 29,811 రేషన్ దుకాణాల ద్వారా కిలో కందిపప్పు, అర కేజీ చక్కెర ఇస్తున్నాటమని ప్రకటించారు నాదెండ్ల మనోహర్.