NEWSANDHRA PRADESH

చంద్ర‌బాబుకు నాదెండ్ల కితాబు

Share it with your family & friends

స్పీక‌ర్ గా ఉన్న స‌మ‌యంలో…

అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు ఆధ్వ‌ర్యంలో కీల‌క‌మైన బీఏసీ స‌మావేశం జ‌రిగింది. ఈ మీటింగ్ కు స్పీక‌ర్ తో పాటు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రులు ప‌య్యావుల కేశ‌వ్ , జ‌న‌సేన పార్టీ త‌ర‌పున మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్, బీజేపీ ప‌క్ష నేత విష్ణు కుమార్ రాజు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా కీల‌క స‌మావేశానికి వైసీపీ నేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాక పోవ‌డం ప‌ట్ల ఒకింత అసంతృప్తిని వ్య‌క్తం చేశారు స్పీక‌ర్ తో పాటు సీఎం . ఇదిలా ఉండ‌గా తాను స్పీక‌ర్ గా ఉన్న స‌మ‌యంలో స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చాలా హుందాత‌నంతో వ్య‌వ‌హ‌రించార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు.

తాను చాలా విస్తు పోవ‌డం జ‌రిగింద‌న్నారు నాదెండ్ల మ‌నోహ‌ర్. ఇదిలా ఉండ‌గా నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఆయ‌న‌లో ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా బీజేపీ ప‌క్ష నాయ‌కుడు విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ క‌నీసం 15 రోజుల పాటు శాస‌న స‌భ స‌మావేశాలు జ‌ర‌గాల‌ని కోరారు. అంతే కాకుండా
ప్రజా ధనంతో కట్టిన ఋషికొండపై చర్చ జరగాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఎమ్మెల్యేలంతా ఓరోజు ఋషికొండ పర్యటన చేపట్టాలని కోరారు.