జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్
నాదెండ్ల మనోహర్ కామెంట్
అమరావతి – ఏపీలో సీన్ మార బోతోందని ప్రజలు స్పష్టంగా మార్పు కోరుకుంటున్నారని అన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. జనసేన- తెలుగుదేశం పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 28న బహిరంగ సభ నిర్వహించనుందని తెలిపారు. ఈ సందర్బంగా నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. సభకు సంబఃధించి లక్షలాది మంది జనాన్ని తరలించేందుకు కృషి చేయాలని కోరారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచక పాలన సాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని అన్నారు. కేవలం 45 రోజులు మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. ఆ తర్వాత తను ఇంటికి వెళ్లక తప్పదన్నారు.
ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడంలో సీఎం టాప్ లో ఉన్నారని ఆరోపించారు. రూ. 25 కోట్లతో రెండు హెలికాప్టర్లను కొనుగోలు చేశారంటూ మండిపడ్డారు. దీనిపై ఎంపీ రఘురామ కృష్ణం రాజు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని కూడా ఆయన ప్రకటించారు. రాబోయే రాజ్యం తమదేనని ధీమా వ్యక్తం చేశారు నాదెండ్ల మనోహర్.