NEWSANDHRA PRADESH

కూట‌మి స‌మ‌న్వ‌యం కీల‌కం

Share it with your family & friends

జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్
విజ‌య‌వాడ – ఏపీలో జ‌ర‌గ‌బోయే శాస‌న స‌భ‌, పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌న‌సేన పార్టీ కూట‌మికి అత్యంత ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్. ఎన్డీయే ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన వ‌ర్కు షాపులో పాల్గొని ప్ర‌సంగించారు. ఈ రెండు నెల‌లు అత్యంత కీల‌క‌మ‌ని అన్నారు. ఏ మాత్రం అజాగ్ర‌త్త‌తో ఉంటే భారీ మూల్యం చెల్లించు కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు నాదెండ్ల మ‌నోహ‌ర్.

ఎవ‌రికి టికెట్ వ‌చ్చినా మిగ‌తా పార్టీల నేత‌లు, శ్రేణులు క‌లిసి పోవాల‌ని, ఆ మేర‌కు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌లో అభ్య‌ర్థుల గెలుపు కోసం కృషి చేయాల‌ని సూచించారు. అధికారంలో ఉన్న వైసీపీ అస‌త్య ప్ర‌చారం చేయ‌డంలో టాప్ లో ఉంద‌న్నారు. దీని వ‌ల్ల ప్ర‌జ‌లు ఒకింత అయోమ‌యానికి గుర‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు నాదెండ్ల మ‌నోహ‌ర్.

ప‌ద‌వుల కోసమో పొత్తు చేసుకోలేద‌ని చెప్పారు. కేవ‌లం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మిగా ఏర్పాటు అయ్యాయ‌ని అన్నారు . ఇప్ప‌టికే ఏర్పాటైన క‌మిటీలు త‌మ బాధ్య‌త‌ల‌ను గుర్తెరిగి క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగాల‌ని స్ప‌ష్టం చేశారు.