NEWSANDHRA PRADESH

28న తెలుగు జ‌న విజ‌య కేత‌నం

Share it with your family & friends

జెండాగా నామ క‌ర‌ణం చేసిన టీడీపీ, జ‌న‌సేన

తాడేప‌ల్లి గూడెం – ఏపీలో పొత్తు పొడిచిన త‌ర్వాత తొలిసారి తెలుగుదేశం పార్టీ, జ‌న సేన పార్టీల సంయుక్త ఆధ్వ‌ర్యంలో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ఇరు పార్టీల అధినేత‌లు స‌మ‌న్వ‌య క‌మిటీని కూడా ఏర్పాటు చేశారు. మంగ‌ళ‌వారం స‌భ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్.

ఈనెల 28న బుధ‌వారం తాడేప‌ల్లి గూడెం స‌మీపంలోని ప్ర‌త్తిపాడు వ‌ద్ద ఉమ్మ‌డి స‌భా వేదిక‌ను ఏర్పాటు చేశారు. దీనిని స్వ‌యంగా ద‌గ్గ‌రుండి ప‌రిశీలించారు నాదెండ్. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేవారు. వేదిక‌ను ప‌రిశీలించిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు.

అంత‌కు ముందు ఉమ్మ‌డి వేదిక‌కు సంబంధించిన స‌భ‌కు నామ‌క‌ర‌ణం చేశారు. ఇందుకు సంబంధించిన జెండాను ఆవిష్క‌రించారు టీడీపీ, జ‌న‌సేన నేత‌లు. ఈ స‌భా వేదికకు తెలుగు జ‌న విజ‌య కేత‌నంగా పేరు పెట్టిన‌ట్లు చెప్పారు నాదెండ్ల మ‌నోహ‌ర్.

సంక్షేమం..అభివృద్ది త‌మ ఉమ్మ‌డి అజెండాగా ఉంటుంద‌న్నారు. రాష్ట్ర అభివృద్దికి సంబంధించి త‌యారు చేసిన ప్ర‌ణాళిక‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తార‌ని చెప్పారు. భారీ ఎత్తున జ‌నం హాజ‌రు కానున్నార‌ని తెలిపారు.