ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి – జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఏపీ కూటమి సర్కార్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గానికి చేరుకున్నారు.
తెనాలి లోకి ప్రవేశించ గానే భారీ ఎత్తున సాదర స్వాగతం లభించింది. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. దారి పొడవునా గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.
ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు నాదెండ్ల మనోహర్. మీరు అందించిన ఈ అపురూప విజయం తెనాలి నియోజకవర్గ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ అంకితం ఇస్తున్నానని ప్రకటించారు. రాచరిక పాలనకు చరమ గీతం పాడారని, ఏమిచ్చి మీకు ఈ రుణం తీర్చు కోగలమని అన్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలలో 5 హామీలపై సంతకాలు కూడా చేయడం జరిగిందని చెప్పారు.