అక్రమ బియ్యం విలువ రూ. 47,537 కోట్లు
1,31,18,345 మెట్రిక్ టన్నులు తరలించారు
విజయవాడ – రాష్ట్ర చరిత్రలో అక్రమ బియ్యం స్కాం వేల కోట్లు దాటిందని అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ . మొత్తం 1,31,19,345 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారని, దీని విలువ రూ. 47,537 కోట్లు ఉంటుందని ఆరోపించారు .
ఆదివారం విజయవాడలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి పాలనలో కాకినాడ పోర్టులోకి ఏ ఒక్కరినీ అనుమతించ లేదన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడని, నిలదీశాడని, విచారణకు ఆదేశించారని చెప్పారు.
గత మూడు ఆర్థిక సంవత్సరాల కాలంలో గంగవరం పోర్టు నుండి 2,20,289 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నం పోర్టు నుండి 23,51,218 మెట్రిక్ టన్నులు, విశాఖపట్నం పోర్టు నుండి 38,02,000 మెట్రిక్ టన్నులు ఎగుమతి అయ్యాయని తెలిపారు.
కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ మూడు సంవత్సరాల నుండి ఎగుమతి చేసింది 1,31,18,346 మెట్రిక్ టన్నులు అని ప్రకటించారు. ఒక్క కాకినాడలోనే జరిగిన బియ్యం అక్రమ రవాణా విలువ మొత్తం రూ. 48, 537 కోట్లు అని అన్నారు నాదెండ్ల మనోహర్.
ప్రభుత్వానికి ప్రతి కిలోకి 43.40 రూ ఖర్చయ్యే ఈ బియ్యాన్ని వీళ్ళు క్షేత్ర స్థాయిలో 10 రూ”లకే తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. దాదాపు 6,300 కోట్ల రూపాయల బియ్యం లెక్కలు చూపించి ఇక్కడ నుండి తరలించేశారని ధ్వజమెత్తారు.