Tuesday, April 22, 2025
HomeNEWSANDHRA PRADESHప్ర‌తి గింజ‌ను కొనుగోలు చేస్తాం - నాదెండ్ల‌

ప్ర‌తి గింజ‌ను కొనుగోలు చేస్తాం – నాదెండ్ల‌

దళారులను నమ్మి మోసపోవద్దని సూచ‌న‌

అమ‌రావ‌తి – ద‌ళారుల‌ను న‌మ్మి రైతులు మోస పోవ‌ద్ద‌ని సూచించారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. బుధ‌వారం కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ‌ నియోజ‌క‌వ‌ర్గంలో ధాన్యం కొనుగోళ్ల‌ను ప‌రిశీలించారు. ప్ర‌తి గింజ‌ను ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుంద‌ని అన్నారు.

కొనుగోలు చేసిన 24 గంట‌ల్లో రైతుల ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ చేస్తామ‌ని చెప్పారు. క‌ష్ట‌ప‌డి పండించిన ధాన్యాన్ని త‌క్కువ ధ‌ర‌కు అమ్ము కోవ‌ద్ద‌ని సూచించారు . రైతుల ప్ర‌యోజ‌నాల కోసం త‌మ స‌ర్కార్ క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో స్థానిక శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ తో కలసి మనోహర్ గారు క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు. రైతులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగొళ్లలో సమస్యలపై రైతులను ఆరా తీశారు.

వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తేమ శాతం అటూ ఇటూగా ఉన్నా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. సాయంత్రంలోపు రైతులు సిద్ధం చేసిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని దిశా నిర్దేశం చేశారు.

చల్లపల్లి మండలం పాత మాజేరు, మంగళాపురం, చల్లపల్లి, కాసానగరం, పెదప్రోలు, ఘంటసాల మండలం లంకపల్లి తదితర గ్రామాలలో ధాన్యాన్ని ప‌రిశీలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments