Tuesday, April 22, 2025
HomeNEWSANDHRA PRADESHరేష‌న్ బియ్యం కేసులో ఎవ‌రినీ వ‌ద‌లం

రేష‌న్ బియ్యం కేసులో ఎవ‌రినీ వ‌ద‌లం

నిప్పులు చెరిగిన నాదెండ్ల మ‌నోహ‌ర్

అమ‌రావ‌తి – మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రేష‌న్ బియ్యానికి సంబంధించి. పేర్ని జయసుధ గోదాములో 3 వేల బస్తాలు కాదని, 4840 బస్తాలు మాయమ‌య్యాయ‌ని ఆరోపించారు. దీనిపై లోతుగా విచార‌ణ చేప‌ట్టామ‌న్నారు. త‌ప్పు చేసిన వారిని వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు. త‌నిఖీల‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని, రెండో గోడౌన్ పైనా అనుమానాలు ఉన్నాయ‌ని, క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేశామ‌న్నారు.

పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ చేస్తే పీడీ చ‌ట్టం కింద కేసులు న‌మోదు చేస్తామ‌న్నారు. ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి ఆధారాలను నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

మాయమైన బియ్యానికి డబ్బు కడితే సరిపోతుందని అనుకుంటున్నారని, కానీ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు నాదెండ్ల మ‌నోహ‌ర్. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని స్ప‌ష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఎవరి మీదా కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు.

పౌర సరఫరాల శాఖ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామ‌ని, రాష్ట్రంలోని 1300 రైస్ మిల్లులకు అందించి బియ్యంగా మారుస్తామ‌న్నారు. ఆ బియ్యాన్ని రాష్ట్రంలోని 104 గోడౌన్లలో భద్ర పరుస్తామ‌న్నారు. ఇక్కడ నిల్వ చేసిన బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు, అంగన్వాడీ కేంద్రాలకు, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కు సరఫరా చేస్తామ‌ని చెప్పారు నాదెండ్ల మ‌నోహ‌ర్.

RELATED ARTICLES

Most Popular

Recent Comments