NEWSANDHRA PRADESH

ప్ర‌జా ధ‌నానికి జ‌గ‌న్ గండి

Share it with your family & friends

జ‌న‌సేన పార్టీ నేత నాదెండ్ల

అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ నిప్పులు చెరిగారు. దిగి పోయే ముందు ప్ర‌జా ధ‌నానికి గండి కొట్టార‌ని ఆరోపించారు. రూ. 25 కోట్లు ఖ‌ర్చు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. నాదెండ్ల మ‌నోహ‌ర్ మీడియాతో మాట్లాడారు.

వైసీపీ ప్ర‌భుత్వం చ‌ట్టానికి తూట్లు పొడుస్తున్నాడ‌ని ఆరోపించారు. వైసీపీ స‌ర్కార్ కు చ‌ట్టం ప‌ట్ల‌, రాజ్యాంగం ప‌ట్ల ఏ మాత్రం గౌర‌వం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాన‌మంత్రికి త‌ప్ప ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌భుత్వ హెలికాప్ట‌ర్లు వాడే హ‌క్కు ఈ దేశంలో ఎవ‌రికీ లేద‌ని పేర్కొన్నార‌ను నాదెండ్ల మ‌నోహ‌ర్.

అస‌లు సీఎం నేరాల‌కు పాల్ప‌డిన వ్య‌క్తి. ఆయ‌న‌కు భ‌ద్ర‌తా లోపం ఎందుకు ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ రెడ్డికి ఉన్న సెక్యూరిటీ కార‌ణాలు ఏమిటో ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌జా ధ‌నం దుర్వినియోగంపై తాము అధికారంలోకి వ‌చ్చాక విచార‌ణ చేప‌డ‌తామ‌ని చెప్పారు.

బాధ్యులైన అధికారుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. తాడేప‌ల్లి గూడెం జ‌న‌సేన‌, టీడీపీ స‌భ రాష్ట్రానికి దిక్సూచి అవుతుంద‌న్నారు నాదెండ్ల మ‌నోహ‌ర్.