నిప్పులు చెరిగిన నాదెండ్ల మనోహర్
తెనాలి – ఏపీలో వైసీపీ పాలనకు తెర పడే రోజు దగ్గరలోనే ఉందన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. శుక్రవారం తెలుగుదేశం , జనసేన పార్టీల కూటమి ఆధ్వర్యంలో తెనాలిలో తెలుగు జన చైతన్య పాదయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలతో కలిసి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మనోహర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ప్రజలు డిసైడ్ అయ్యారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు.
రాబోయే రోజుల్లో ఇటు అసెంబ్లీలో అటు పార్లమెంట్ లో టీడీపీ, జనసేన కూటమి దుమ్ము రేపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో రాజకీయం చేశాడని జగన్ పై మండిపడ్డారు. ప్రస్తుతం మరో కొత్త నాటకానికి తెర లేపాడంటూ మండిపడ్డారు.
విశాఖ కేంద్రంగా రాజధాని అంటూ ఓట్లు దండుకునేందుకు ప్లాన్ చేశాడని, ఆయన మాయ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు నాదెండ్ల మనోహర్.