శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు బెటర్
దర్శకుడు నాగ్ అశ్విన్ కామెంట్స్
హైదరాబాద్ – ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రిన్స్ మహేష్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడి పాత్రలో సరిగ్గా సరి పోతాడని అన్నారు. తన ఛాయిస్ మాత్రం అతడేనంటూ స్పష్టం చేశారు . పూర్తి స్థాయిలో నటిస్తే తన అభిమానులకు పసందైన పండగేనంటూ పేర్కొన్నారు. తనకు మహేష్ బాబు నటించిన ఖలేజా అంటే ఇష్టమని చెప్పారు.
సినీ అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు దర్శకుడు నాగ్ అశ్విన్ . తాను తీసిన కల్కి తనకు మంచి పేరు తీసుకు వచ్చేలా చేసిందన్నారు. ప్రభాస్ లాంటి నటుడు దొరకడం వల్లే అది సాధ్యమైందన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన టాలెంట్ ఉందన్నారు. వారిలో ఎందరో హీరోలు ఉన్నారని చెప్పారు నాగ్ అశ్విన్.
ఒక రకంగా చెప్పాలంటే దర్శకుడు హీరో ఎవరైనా ఉన్నారంటే తన దృష్టిలో మహేష్ బాబు మాత్రమే అన్నారు. ఇదిలా ఉండగా నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.